కోర్టు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వానికి సోయి రాలేదు: కోదండరాం

గణతంత్ర వేడుకలపై కోర్టు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వానికి సోయి రాకపోవడం దురదృష్టకరమని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.

Updated : 27 Jan 2023 05:57 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలపై కోర్టు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వానికి సోయి రాకపోవడం దురదృష్టకరమని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం ప్రసంగిస్తూ.. గవర్నర్‌తో వ్యక్తిగత విభేదాలున్నా రాజ్యాంగపరమైన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలని సూచించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలన్నారు. రాజ్యాంగం భారతదేశ చరిత్రను తిరగరాసినట్లు ముఖ్యమంత్రి గ్రహించడం లేదని.. సమాజంలో ఆర్థిక, సాంఘిక అసమానతలను లేకుండా చేసిందని గుర్తించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని