రేవంత్‌ వ్యాఖ్యలు సరికాదు: కూనంనేని

కమ్యూనిస్టులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Published : 27 Jan 2023 04:23 IST

హిమాయత్‌నగర్‌ న్యూస్‌టుడే: కమ్యూనిస్టులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లో పార్టీ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, పశ్య పద్మలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేసే పొరపాట్లకు వామపక్షాలు బాధ్యత వహించాలని రేవంత్‌రెడ్డి అనడం సరికాదన్నారు. ‘‘పేదలకు ఇళ్లస్థలాలు, గిరిజనులకు పోడు భూములు తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడుతున్న తమను రేవంత్‌ ఎందుకు గుర్తించడం లేదు? అంశాల వారీగానే భారాసకు మద్దతు ఇస్తున్నాం. గవర్నర్‌ నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమాన్ని బహిష్కరించాం. గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని తమ పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతోంది’’ అని అన్నారు. అంతకుముందు మఖ్ధూంభవన్‌ ఆవరణలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూనంనేని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు