గవర్నర్‌ తన హోదాను మరిచిపోయి మాట్లాడటం బాధాకరం: తలసాని

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గవర్నర్‌ గణతంత్ర దినోత్సవం రోజు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని, ఆమెపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

Published : 27 Jan 2023 04:23 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గవర్నర్‌ గణతంత్ర దినోత్సవం రోజు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని, ఆమెపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం ఆయన సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని దక్కన్‌ భవనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి అంటే బంగ్లాలు కాదని గవర్నర్‌ అంటున్నారని మరి పార్లమెంటు ఉండగా మరో భవనం, ప్రధాని బంగ్లాలను కడుతున్నారని.. దాన్నేమంటారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, డీజీపీ, సీఎస్‌ను పక్కన పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆమె హోదాను మరిచిపోయి మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇలా విమర్శించడం.. గవర్నర్‌ హోదాను దిగజార్చే విధంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. గవర్నర్‌ ప్రభుత్వంతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ఉండాలని, ఒక పార్టీ కింద పనిచేసే వారిగా ఉంటే తాము ఊరుకోబోమని చెప్పారు. .


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు