కేంద్రానికి ఏజెంటుగా గవర్నర్‌ : మంత్రి ఎర్రబెల్లి

కేంద్ర ప్రభుత్వానికి ఏజెంటులా గవర్నర్‌ తమిళిసై పని చేస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.

Published : 27 Jan 2023 04:23 IST

పర్వతగిరి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వానికి ఏజెంటులా గవర్నర్‌ తమిళిసై పని చేస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాల శివాలయం విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభ వేడుకల్లో గురువారం పాల్గొని వెళ్తుండగా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ‘నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ఏ గవర్నర్‌ ఇలా ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడలేదు.. ప్రభుత్వ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు’ అని అన్నారు. ‘ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండి కేంద్రానికి ఏజెంట్‌లా మాట్లాడటం.. వ్యవహరించడం సరికాదు.. నేను గవర్నర్‌ను కోరుతున్నా.. దయచేసి ఇలాంటి మాటలొద్దు’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని