Balakrishna: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు గురువారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది.

Published : 27 Jan 2023 07:22 IST

హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా  హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు గురువారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజలకు అభివాదం చేసి వెనుదిరిగే సమయంలో వాహనం ముందుకు కదలడంతో నిల్చున్న బాలకృష్ణ ఒక్కసారిగా వెనక్కితూలి పడబోయారు. వెంటనే పట్టభద్రుల తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి గోపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని