29న భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆదివారం (ఈ నెల 29న) భారాస పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

Published : 28 Jan 2023 04:30 IST

ఈనాడు హైదరాబాద్‌: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆదివారం (ఈ నెల 29న) భారాస పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలు, వాటిపై అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశాల్లో పలు బిల్లులను ప్రత్యేకించి విద్యుత్తు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీన్ని భారాస తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లుతో పాటు తెలంగాణ బడ్జెట్‌లో కేటాయింపుల కోసం చేసిన ప్రతిపాదనలు, కేంద్రం స్పందించే తీరు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను వ్యతిరేకించే క్రమంలో ఇతర పార్టీలతో సమన్వయం తదితర అంశాల పైనా చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని