2 నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల తెలిపారు.

Published : 28 Jan 2023 04:30 IST

మా గొంతు నొక్కేందుకే షరతులతో అనుమతి: షర్మిల

ఈనాడు, హైదరాబాద్‌-చెన్నారావుపేట, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం(ఈ నెల 28) నుంచి పాదయాత్రకు అనుమతి కావాలని కోరగా వరంగల్‌ పోలీసులు నిరాకరించారని తెలిపారు. ఇంతకుముందు పాదయాత్ర నిలిచిన నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మతండా నుంచి తిరిగి మొదలుపెడతామని వివరించారు. ‘‘తెలంగాణలో కేసీఆర్‌ పాలనకు మా పాదయాత్ర చరమగీతం పాడుతుంది. ప్రజలు మాకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు. అందుకే 15 షరతులు విధిస్తూ అనుమతి ఇచ్చారు’’ అని షర్మిల పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని