ఇందిరమ్మ ఇళ్లులేని పల్లెల్లో ఓట్లు అడగం: రేవంత్‌

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లులేని గ్రామాల్లో కాంగ్రెస్‌ ఓట్లు అడగదని, రెండు పడక గదుల ఇళ్లు నిర్మించని గ్రామాల్లో భారాస నాయకులు ఓట్లు అడగకుండా ఉంటారా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Published : 28 Jan 2023 04:30 IST

పరిగి, దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లులేని గ్రామాల్లో కాంగ్రెస్‌ ఓట్లు అడగదని, రెండు పడక గదుల ఇళ్లు నిర్మించని గ్రామాల్లో భారాస నాయకులు ఓట్లు అడగకుండా ఉంటారా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీ, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు గత ఎన్నికల్లో కొడంగల్‌కు ఇచ్చిన ఒక్కహామీ అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. జగిత్యాల, సిరిసిల్లలా కొడంగల్‌ మారాలంటే బలమైన నాయకత్వం అవసరమన్నారు. ప్రజలంతా సమైక్యంగా ఉండేందుకు రాహుల్‌ జోడో యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, భారాస సీనియర్‌ నాయకుడు గుర్నాథ్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో రేవంత్‌రెడ్డి కలిశారు. రాహుల్‌ పాదయాత్రకు మద్దతివ్వాలని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సైతం ఈ విషయాన్ని గుర్తు చేశారని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని