ప్రజారోగ్యంపై కేసీఆర్‌కు పట్టింపు లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త సచివాలయం, పార్టీ కార్యాలయాలు, క్యాంప్‌ ఆఫీసుల నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపైన లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌, హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర మానిటరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

Published : 29 Jan 2023 03:12 IST

హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర మానిటరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త సచివాలయం, పార్టీ కార్యాలయాలు, క్యాంప్‌ ఆఫీసుల నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపైన లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌, హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర మానిటరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ చేపట్టిన ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఆ పార్టీ ఛార్జిషీట్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం గాంధీభవన్‌లో మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ‘వైద్య ఆరోగ్య శాఖలో హామీలు- వైఫల్యాలు’ అంశంపై ఛార్జిషీట్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు వైద్య, ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఛార్జిషీట్‌లో 16 అంశాలను పొందుపరిచినట్లు వివరించారు.

కొన్ని అంశాలు..

* తెలంగాణలో 1,600 పీహెచ్‌సీలు ఉండాల్సి ఉండగా.. అవి సగానికే పరిమితమయ్యాయి.

* వాటిలోనూ సిబ్బంది కొరత ఉంది.

* మండల స్థాయిలో 30 పడకల దవాఖానా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి, జిల్లా కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాల హామీలు అమలుకు నోచుకోలేదు.

* బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయించే నిధుల్లో కోత విధించారు.

* ‘108’, ‘104’లను నీరుగార్చారు.

* ప్రతి వ్యక్తికి ‘హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు’ హామీ నెరవేరలేదు.

* ఆరోగ్యశ్రీ బకాయిలు అందక ప్రజల ఆరోగ్యం ప్రమాదకరంలో పడింది.

* జర్నలిస్టుల హెల్త్‌కార్డులు పనిచేయడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని