బకాయిలు తీర్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి

చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న బకాయిలను తీర్చేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated : 29 Jan 2023 05:20 IST

సీఎం కేసీఆర్‌కు ఎంపీ ఉత్తమ్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న బకాయిలను తీర్చేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. గత ఎన్నికల్లో పంటరుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు రూ.20 వేల కోట్లు, మహిళా స్వయం సహాయక సంఘాల పాత బకాయిలకు రూ.4,000 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలకు రూ.3,270 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. ‘‘రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన ఆర్థిక హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన వివిధ పథకాల బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో పలు సంక్షేమ పథకాలు నిర్వీర్యమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున మీ ప్రభుత్వ చివరి బడ్జెట్‌ ఇదే అవుతుంది. పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి’’ అని డిమాండ్‌ చేస్తూ ఉత్తమ్‌ లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని