నందికొట్కూరు ఎమ్మెల్యేపై అసంతృప్తి

‘గత ఎన్నికల్లో సీఎంగా జగన్‌ను, ఎమ్మెల్యేగా మిమ్మల్ని కష్టపడి గెలిపించుకున్నందుకు మాకు తగిన శాస్తి జరుగుతోంది’ అని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం సుంకేసుల గ్రామస్థులు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్‌వద్ద అసంతృప్తిని వెళ్లగక్కారు.

Published : 29 Jan 2023 03:28 IST

మిడుతూరు, న్యూస్‌టుడే: ‘గత ఎన్నికల్లో సీఎంగా జగన్‌ను, ఎమ్మెల్యేగా మిమ్మల్ని కష్టపడి గెలిపించుకున్నందుకు మాకు తగిన శాస్తి జరుగుతోంది’ అని నంద్యాల జిల్లా మిడుతూరు మండలం సుంకేసుల గ్రామస్థులు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్‌వద్ద అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే శనివారం సుంకేసుల గ్రామంలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. వైకాపా కోసం కష్టపడి పని చేసిన వారిని కాదని, ఇతర పార్టీల్లోంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని మహిళలు వాపోయారు. వైకాపా విజయం కోసం కృషి చేసిన తమకు కనీసం ఇంటి స్థలమూ ఇవ్వడం లేదని మరికొందరు నిలదీశారు. అర్హులకు ఇళ్ల స్థలాల్ని ఎందుకు కేటాయించలేదని సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని