నీటి సమస్యలు తీర్చలేని నాయకులెందుకు?

నీటి సమస్యలు తీర్చలేని నాయకులెందుకంటూ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని మహిళలు ప్రశ్నించిన ఉదంతమిది.

Updated : 29 Jan 2023 05:10 IST

ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిపై  మహిళల అసహనం

ఆదోని పట్టణం, న్యూస్‌టుడే: నీటి సమస్యలు తీర్చలేని నాయకులెందుకంటూ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని మహిళలు ప్రశ్నించిన ఉదంతమిది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం మాత్రికి గ్రామంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి శనివారం పర్యటించారు. సావిడి వీధిలో మహిళలను ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నించగా.. తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇళ్ల ముంగిట తాగునీటి పైపులున్నా కుళాయిల్లేవన్నారు. 8 రోజులకోసారి రాత్రి ఒంటి గంటకు నీరు వదులుతున్నారని, అవీ శుభ్రంగా లేవని అసహనం వ్యక్తం చేశారు. ఉసేన్‌ బీ అనే మహిళ ఇంటివద్దకు వెళ్లి పథకాల గురించి ఎమ్మెల్యే మాట్లాడుతుండగా... తమకు చేయూత పథకం అందడం లేదని, తాగునీటి కుళాయి లేదంటూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. రూ.50 లక్షలతో ట్యాంకు ఏర్పాటుకు భూమి పూజ చేశామని, ఉగాదికి నీటి వసతి కల్పిస్తామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు