జోడో యాత్రకు భద్రత కల్పించండి

జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రకు భద్రత కల్పించే అంశంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం లేఖ రాశారు.

Updated : 29 Jan 2023 04:51 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఖర్గే లేఖ

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రకు భద్రత కల్పించే అంశంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం లేఖ రాశారు. 30వ తేదీన శ్రీనగర్‌లో జరిగే ముగింపు సభకు వివిధ పార్టీల అగ్రనేతలు రానున్నారని.. అప్పటి వరకూ యాత్రకు పూర్తి భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఖర్గే పేర్కొంటూ లేఖను ట్వీట్‌ ద్వారా కూడా వెల్లడించారు. భారత్‌ ఇప్పటికే ఇద్దరు ప్రధానులను, పలువురు నాయకులను కోల్పోయిందని గుర్తుచేస్తూ.. యాత్రలో గట్టి భద్రతకు డిమాండు చేశారు. జమ్మూకశ్మీర్‌ పోలీసులు భద్రతను ఉపసంహరించుకోవడంతో యాత్రను నిలిపివేస్తున్నామని శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని