అచ్చెన్నాయుడుపై కేసు నమోదు

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కుప్పం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 29 Jan 2023 04:45 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కుప్పం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం కమతమూరు రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో... పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొడుతూ, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కుప్పం అర్బన్‌ ఎస్సై శివకుమార్‌ ఫిర్యాదిచ్చారు. ఈ మేరకు అర్బన్‌ సీఐ శ్రీధర్‌ ఐపీసీ సెక్షన్‌ 153 కింద కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు