తెదేపా సాధికార కేంద్రం ద్వారా 30 మందికి ఉద్యోగాలు

తెదేపా సాధికార కేంద్రంలో శిక్షణ పొందిన 30 మంది యువతీయువకులకు ర్యాపిడో ఆన్‌ బోర్డింగ్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు లభించాయి.

Published : 29 Jan 2023 04:45 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా సాధికార కేంద్రంలో శిక్షణ పొందిన 30 మంది యువతీయువకులకు ర్యాపిడో ఆన్‌ బోర్డింగ్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు లభించాయి. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఉద్యోగాలు పొందిన యువతను ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అభినందించారు. ఉద్యోగ కల్పనలో భాగంగా మొదటి విడతగా 30 మందికి రెండు నెలలు శిక్షణ ఇచ్చినట్లు తెదేపా సాధికార కేంద్రం నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెదేపా ఎన్నారై విభాగం ప్రతినిధులు వేమూరి రవి, చప్పిడి రాజశేఖర్‌, డీవీ రావు, ర్యాపిడో సంస్థ ప్రతినిధి జి.రామారావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు