Ambati Rambabu: ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు: మంత్రి అంబటి

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated : 29 Jan 2023 08:52 IST

గోరంట్ల (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నాయకులను నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత మంది కలిసి వచ్చినా వైకాపానే అధికారంలోకి వస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి’ అని పేర్కొన్నారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వెలవెలబోయిందని తెలిపారు. చిరంజీవి సినిమాలతో సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఉన్నారని, ఆయన రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు