జోడో యాత్ర ముగింపు సభకు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తరలివెళ్లారు.

Published : 30 Jan 2023 04:12 IST

నేడు ముగియనున్న రాహుల్‌ పాదయాత్ర

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తరలివెళ్లారు. జోడో యాత్ర సోమవారం కశ్మీర్‌లో ముగియనున్న విషయం తెలిసిందే. కాగా పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆదివారం శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ వద్ద రాహుల్‌గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. భారత్‌ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు వారు రాహుల్‌ను అభినందించారు. ముగింపు సభకు రాష్ట్ర ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కూడా హాజరు కానున్నారు. ఇందుకోసం పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఇప్పటికే దిల్లీ వెళ్లారు. ఇదిలా ఉండగా భారత్‌ జోడోయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని