Nitish Kumar: కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: నీతీశ్‌కుమార్‌

హైదరాబాద్‌లో కేసీఆర్‌ సభకు హాజరైనంత మాత్రాన.. కాంగ్రెస్‌తో తమ భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ స్పష్టంచేశారు.

Updated : 30 Jan 2023 08:21 IST

సచివాలయ ప్రారంభోత్సవానికి  రాలేనని చెప్పానని వెల్లడి
 

హైదరాబాద్‌లో కేసీఆర్‌ సభకు హాజరైనంత మాత్రాన.. కాంగ్రెస్‌తో తమ భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి విపక్షాలను ఏకం చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను విరమించలేదని తెలిపారు.  తెలంగాణ సచివాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ తనను ఆహ్వానించారని.. అయితే తనకిక్కడ చాలా పనులు ఉండటంతో  రాలేకపోతున్నట్లు తెలిపారు.

దీంతో పార్టీ నుంచి ఎవరినైనా పంపించాలని, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సైతం ఈ విషయం చెప్పాలని కేసీఆర్‌ కోరారు. ఈ నేపథ్యంలో తన బదులు తేజస్వీ యాదవ్‌, జనతాదళ్‌(యునైటెడ్‌) అధ్యక్షుడు లలన్‌ సింగ్‌లు ఆ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పాను.  ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం  బహిరంగ సభ జరుగనుంది. ఖమ్మంలో నిర్వహించిన భారాస సభకు తనను ఎవరూ పిలవలేదని, పిలిచినా వచ్చి ఉండేవాడిని కాదని గతంలో నీతీశ్‌ చెప్పిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు