హామీలను విస్మరించిన భారాస ప్రభుత్వం: కాసాని

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును తెలంగాణలోని భారాస ప్రభుత్వం విస్మరించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విమర్శించారు.

Published : 30 Jan 2023 04:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును తెలంగాణలోని భారాస ప్రభుత్వం విస్మరించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విమర్శించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందించకుండా మోసగిస్తోందని మండిపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఇక్కడ కాసాని సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వం చెబుతున్న విషయాలకు, చేస్తున్న పనులకు పొంతన లేదన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు