‘విభజన హామీల’పై జంతర్‌మంతర్‌లో దీక్ష నేడు

తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ విభజన చట్టంలో చెప్పిన హామీలు అమలు చేయకపోవడం, కృష్ణా నదీ జలాల సమస్యను పరిష్కరించనందుకు నిరసనగా దిల్లీలోని జంతర్‌మంతర్‌లో సోమవారం దీక్ష చేపట్టనున్నట్లు తెజస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు.

Updated : 30 Jan 2023 06:24 IST

తెజస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం

ఈనాడు, దిల్లీ: తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ విభజన చట్టంలో చెప్పిన హామీలు అమలు చేయకపోవడం, కృష్ణా నదీ జలాల సమస్యను పరిష్కరించనందుకు నిరసనగా దిల్లీలోని జంతర్‌మంతర్‌లో సోమవారం దీక్ష చేపట్టనున్నట్లు తెజస రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. అలాగే, సీఎం కేసీఆర్‌ పాలనా వైఫల్యాలపై మంగళవారం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయస్థాయి సెమినార్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఇప్పటివరకూ పలు ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థల విభజన పూర్తిగా జరగలేదు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు కేవలం 22 శాతం నీటి వాటా మాత్రమే దక్కింది. ఈ వాటాతో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయడం సాధ్యం కాదు. వీటితోపాటు విభజన చట్టంలోని చాలా అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అడగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో తెలంగాణ ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్‌ చేయడానికి దేశ రాజధానిలో దీక్ష, సెమినార్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు