నాందేడ్‌ భారాస సభ ఏర్పాట్ల పరిశీలన

పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న భారాస  బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడి పరిశీలించారు.

Published : 30 Jan 2023 04:12 IST

నిర్మల్‌, న్యూస్‌టుడే: పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న భారాస  బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడి పరిశీలించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌ తదితరులతో కలిసి ఆయన సభాస్థలితో పాటు పార్కింగ్‌ ప్రాంతాలు, బారికేడ్లు, ఇతర పనులను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్‌తో పాటు జాతీయస్థాయి నేతలు వస్తున్నందున అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన చాలా మంది పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. సభలో కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు భారాసలో చేరనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆయన నాందేడ్‌లోని సిక్కుల పవిత్రస్థలం గురుద్వార్‌ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని