ఎస్పీ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్‌, స్వామి ప్రసాద్‌ మౌర్య

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్‌ యాదవ్‌, స్వామి ప్రసాద్‌ మౌర్య సహా 14 మంది నియమితులయ్యారు.

Published : 30 Jan 2023 06:32 IST

అధ్యక్షునిగా కొనసాగనున్న అఖిలేశ్‌

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా శివపాల్‌ యాదవ్‌, స్వామి ప్రసాద్‌ మౌర్య సహా 14 మంది నియమితులయ్యారు. అధ్యక్షునిగా అఖిలేశ్‌ యాదవ్‌, జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా రాంగోపాల్‌ యాదవ్‌ కొనసాగే జాతీయ కార్యవర్గంలో మొత్తం 63 మంది నేతలకు స్థానం లభించింది. జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా జయాబచ్చన్‌ సహా పలువురు ఉంటారు. నూతన కార్యవర్గాన్ని పార్టీ ఆదివారం ప్రకటించింది. రామచరితమానస్‌పై వ్యాఖ్యలు చేసి వివాదం రేకెత్తించిన స్వామి ప్రసాద్‌ మౌర్యను ప్రధాన కార్యదర్శిగా నియమించడాన్ని భాజపా తప్పుపట్టింది. అఖిలేశ్‌-శివపాల్‌ మధ్య 2016 నుంచి విభేదాలు ఉండేవి. పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ మరణానంతరం గత ఏడాది డిసెంబరులో మైన్‌పురి లోక్‌సభ స్థాన ఉప ఎన్నికల్లో మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు