చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్న ప్రభుత్వం

తెదేపా అధినేత చంద్రబాబు సహా ఇతర ప్రతిపక్షనేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు.

Published : 31 Jan 2023 03:13 IST

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను సస్పెండ్‌ చేయాలి
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు సహా ఇతర ప్రతిపక్షనేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. ఇన్నాళ్లూ ఫోన్లను ట్యాప్‌ చేయడం లేదంటూ బుకాయిస్తున్న ప్రభుత్వం...తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయుల్ని తక్షణం సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ట్యాపింగ్‌ చేయడమే పనిగా ఉంది. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రికి చేరవేస్తున్నారు. సీతారామాంజనేయులకు వృత్తి మీద నిబద్ధత ఉంటే జగన్‌రెడ్డి ఫోన్‌ ట్యాప్‌ చేసి ఎందుకు దిల్లీ వెళ్తున్నారో చెప్పాలి’ అని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు