ఎమ్మెల్సీ సమక్షంలో వైకాపా నాయకుల బాహాబాహీ

చిత్తూరు జిల్లా కుప్పం మండలం గరిగచినేపల్లెలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్సీ వెంట ఉన్న ఓ వైకాపా ప్రజాప్రతినిధికి ఇసుక ట్రాక్టర్‌ కంటపడింది.

Published : 31 Jan 2023 03:13 IST

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గరిగచినేపల్లెలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్సీ వెంట ఉన్న ఓ వైకాపా ప్రజాప్రతినిధికి ఇసుక ట్రాక్టర్‌ కంటపడింది. వెంటనే అతను ట్రాక్టర్‌ను ఆపడంతో అక్కడే ఉన్న ఓ వైకాపా మండల నాయకుడు కలుగజేసుకొని రోడ్లపై వెళ్లే ఇసుక   ట్రాక్టర్‌ను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ సమక్షంలోనే ఒకరికొకరు దుర్భాషలాడుతూ బాహాబాహీకి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఇటీవల కుప్పం పర్యటనకు వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలోనే ఇద్దరు వైకాపా నాయకులు గొడవ పడ్డ సంఘటన మరవక ముందే ఇలా ఎమ్మెల్సీ సమక్షంలో మరో ఘటన చోటుచేసుకోవడం కుప్పంలో చర్చనీయాంశంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు