గవర్నర్‌ను బద్నాం చేసేందుకు యత్నించి భంగపడ్డారు

‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్ల్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపించడం ఆనవాయితీ. వాటిని గవర్నర్‌ వెనక్కి పంపించలేదు.

Published : 31 Jan 2023 03:37 IST

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ విమర్శ

నారాయణగూడ, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్ల్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపించడం ఆనవాయితీ. వాటిని గవర్నర్‌ వెనక్కి పంపించలేదు. తిరస్కరించలేదు. అసెంబ్లీ సమావేశాలకు ఇంకా సమయం ఉంది. ఇంతలోనే కోర్టుకు వెళ్లి గవర్నర్‌ను బద్నాం చేసేందుకు యత్నించి ముఖ్యమంత్రి భంగపడ్డారు. ఆయన హైకోర్టుకు వెళ్లిన ప్రతిసారీ మొట్టికాయలే పడ్డాయి’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఇటీవల డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించి పోలీసుల లాఠీఛార్జిలో గాయపడి.. చికిత్స పొందుతున్న భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేయడానికి వచ్చిన భాజపా యువమోర్చా నాయకులను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు కనీసం డీపీఆర్‌ ఇవ్వలేదని, 8 సార్లు లేఖ రాసినా స్పందన లేదని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఆయన వెంట జాతీయ ఎస్సీ కమిషన్‌ పూర్వ సభ్యులు రాములు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని