చావనైనా చస్తాను కానీ భాజపాతో మళ్లీ కలవను: నీతీశ్‌

చావనైనా చస్తాను కానీ భాజపాతో మళ్లీ కలవనని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అగ్రనాయకుడు నీతీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

Updated : 31 Jan 2023 04:28 IST

పట్నా: చావనైనా చస్తాను కానీ భాజపాతో మళ్లీ కలవనని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అగ్రనాయకుడు నీతీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. జనాదరణ లేని జేడీయూ నాయకుడితో తమకు ఇక పొత్తు ఉండదని భాజపా ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించడం గమనార్హం. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో విలేకర్లతో మాట్లాడుతూ.. మైత్రి ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలోనూ భాజపా తమ పార్టీని సరిగా గౌరవించలేదన్నారు. 2017లో భాజపాతో పొత్తును పునరుద్ధరించుకుని తప్పు చేశానన్నారు. 2020 ఎన్నికల్లో వారి ఓట్లను తమ అభ్యర్థులకు బదిలీ చేయనందుకు భాజపాకు కృతజ్ఞతలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామన్న భాజపా ప్రకటనపై నీతీశ్‌ మాట్లాడుతూ..  ఎన్నికలప్పుడు వారు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటారని బదులిచ్చారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని