గాంధీ హత్య నుంచే దేశంలో ఉగ్రవాదం తీవ్రరూపం

స్వతంత్ర భారతదేశంలో మహాత్మాగాంధీని గాడ్సే కాల్చి చంపిన రోజు నుంచే దేశంలో ఉగ్రవాదం క్రూరరూపం దాల్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

Updated : 31 Jan 2023 06:27 IST

 ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారతదేశంలో మహాత్మాగాంధీని గాడ్సే కాల్చి చంపిన రోజు నుంచే దేశంలో ఉగ్రవాదం క్రూరరూపం దాల్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్‌ శ్రద్ధాంజలి ఘటించారు. జాతిపిత గాంధీ ఆశయాలను ఆచరిద్దామని, శాంతి, మత సామరస్యాన్ని కాపాడటమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని ట్విటర్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు

జాతీయవాదం పేరిట అవమానించొద్దు..

ప్రధాని నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త అదానీ.. హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలపై స్పష్టత ఇవ్వకుండా జాతీయవాదం పేరు చెప్పి తప్పించుకోవాలనుకోవడం ఘన దేశప్రజలను అవమానించడమే అవుతుందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై అదానీ గ్రూపు ఇచ్చిన వివరణను ఉద్దేశించి ఆయన ఈ వాఖ్యలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు