‘సంకల్ప సిద్ధి’లో సూత్రధారులు ఎమ్మెల్యే వంశీ అనుచరులు

రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన సంకల్పసిద్ధి స్కాంలో ప్రధాన సూత్రధారులు రంగా, నాని.. వల్లభనేని వంశీ అనుచరులని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు.

Published : 31 Jan 2023 05:05 IST

తెదేపా నేత పట్టాభి ధ్వజం
ఎమ్మెల్యే వంశీ పరువు నష్టం దావా

గుంటూరు (పట్టాభిపురం), గన్నవరం గ్రామీణం న్యూస్‌టుడే: రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన సంకల్పసిద్ధి స్కాంలో ప్రధాన సూత్రధారులు రంగా, నాని.. వల్లభనేని వంశీ అనుచరులని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘దీనిపై డ్రామాలు ఆడుతున్న వంశీ నిజాయతీగా వారిని పోలీసులకు అప్పగించాలి. ఈ స్కాంలో మరో నిందితుడు గుత్తా కిరణ్‌ విదేశాలకు పారిపోయాడు. ప్రధాన అనుమానితుల్ని విజయవాడలోని ఓ హోటల్‌లో సీఐడీ అధికారులు రహస్యంగా కలిసింది వాస్తవం కాదా? తెదేపా అధికారంలోకి రాగానే ఈ కేసును తిరగదోడతాం’ అని పేర్కొన్నారు.

ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం: వంశీ

సంకల్పసిద్ధి గొలుసు కట్టు మోసంలో తనతోపాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాత్ర ఉందంటూ పట్టాభిరామ్‌ దుష్ప్రచారం చేస్తున్నందున రూ.కోటి పరువు నష్టం దావాను 12వ అదనపు న్యాయస్థానంలో వేసినట్లు ఎమ్మెల్యే వంశీ చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో తెదేపా గుర్తుపై గెలిచానని, ఆ పార్టీని విభేదించడంతో కొందరు నేతలు అసంబద్ధమైన ఆరోపణలతో ప్రణాళికాబద్ధమైన దుష్ప్రచారానికి తెరతీశారని చెప్పారు. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, ఎమ్మెల్సీ అర్జునుడిపై ఈ దావా వేసినట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు