సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం

రాష్ట్రంలో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తరచూ పేర్కొనడం హాస్యాస్పదమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే ఆస్తిపరుడు, అరాచక వాది మరొకరు లేరని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 31 Jan 2023 05:05 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తరచూ పేర్కొనడం హాస్యాస్పదమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే ఆస్తిపరుడు, అరాచక వాది మరొకరు లేరని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్రంలోని పేదలకు ఆయనకు మధ్యనే యుద్ధమని చెప్పకనే చెబుతున్నారా అని ప్రశ్నించారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం ఎక్కడ బటన్‌ నొక్కడానికి వెళ్లినా అక్కడ రోడ్లపై ఉన్న పచ్చని చెట్లను నరికి వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అశోకుడు చెట్లను నాటించెను అని చెప్పేవారని, ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి చెట్లను నరికిస్తున్నాడని చెబుతున్నారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తన తమ్ముడు అవినాష్‌రెడ్డిని విచారించేటప్పుడు న్యాయవాది ఉండాలని, వీడియో చిత్రీకరించాలని  కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అవినాష్‌రెడ్డి అమాయకుడని చెబుతున్న ఎమ్మెల్యేలు అసలు దోషి ఎవరో చెప్పాలని కోరారు. దిల్లీలో డీవోపీటీ అధికారులను కలిసి సీఐడీ మాజీ అధిపతి సునీల్‌కుమార్‌పై ఉన్న పెండింగ్‌ కేసుల వివరాలను మరోసారి అందజేస్తానని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు