‘పల్నాడు ప్రజా సమస్యల పెట్టె’ కార్యక్రమంపై పవన్‌ అభినందనలు

పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకునేందుకు జనసేన కార్యకర్త బాలాజీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినందుకు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆయనను అభినందించారు.

Published : 31 Jan 2023 05:05 IST

ఈనాడు, అమరావతి: పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకునేందుకు జనసేన కార్యకర్త బాలాజీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినందుకు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆయనను అభినందించారు. పల్నాడు ప్రాంతంలో ఊరూరూ తిరుగుతూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పవన్‌కల్యాణ్‌కు అందించేలా ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ‘పల్నాడు ప్రజాసమస్యల పెట్టె’ పేరిట దీనిని కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్‌కల్యాణ్‌ బాలాజీని జనసేన కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. ఈ ఆలోచనకు మెచ్చిన జనసేనాధిపతి  ప్రోత్సాహకంగా ఆయనకు కొంత నగదు, మొబైల్‌ ఫోను బహూకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని