వాస్తవాలకు దగ్గరగా గవర్నర్‌ ప్రసంగం ఉండాలి: భాజపా

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వాస్తవాలను ప్రతిబింబించేలా ఈసారి గవర్నర్‌ ప్రసంగం ఉండాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 01 Feb 2023 06:31 IST

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వాస్తవాలను ప్రతిబింబించేలా ఈసారి గవర్నర్‌ ప్రసంగం ఉండాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ప్రతిసారి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరుస్తుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, మూడెకరాల భూమి ఇవ్వలేదనే వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్థిక పరిస్థితి దిగజారి అప్పుల ఊబిలో మునిగిపోయి, జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందనే విషయాన్ని అందులో చేర్చాలని కోరారు. న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకే గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని తెరపైకి తీసుకువస్తున్నారని ప్రభాకర్‌ దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని