రాజ్యాంగాన్ని అవమానిస్తున్న కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగాన్ని పదేపదే అవమానిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 01 Feb 2023 03:56 IST

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్యాంగాన్ని పదేపదే అవమానిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారాస ఎంపీలకు కేసీఆర్‌ సూచించడం రాజ్యాంగానికి, రాజ్యాంగబద్ధమైన పదవులకు ఆయన ఇచ్చే గౌరవాన్ని తెలియజేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలనే కాదు గవర్నర్లను, ప్రధానమంత్రిని.. రాష్ట్రపతిని గౌరవించడం కూడా కేసీఆర్‌కు రాదని మండిపడ్డారు. రాజీనామాకు సిద్ధమంటూ భారాస నేతలు చెప్పే మాటలు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారాస ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిన పని లేకుండానే మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు రాగానే వారిని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని