రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ సిగ్గుచేటు

రాష్ట్రపతి ప్రసంగాన్ని భారాస బహిష్కరించడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. దిల్లీ విజయ్‌చౌక్‌లో పార్టీ ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌లతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated : 01 Feb 2023 06:00 IST

భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌  

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి ప్రసంగాన్ని భారాస బహిష్కరించడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. దిల్లీ విజయ్‌చౌక్‌లో పార్టీ ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌లతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో భారాస పైకి చెబుతున్నది ఒకటైతే.. లోపలున్న ఉద్దేశం వేరన్నారు. దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీనవర్గాల మహిళలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ద్వేషమని ఆరోపించారు. గతంలో మైనారిటీ, ఎస్సీ వ్యక్తులను రాష్ట్రపతులను చేసిన భాజపా.. ఈ సారి ఆదివాసీ మహిళను అభ్యర్థిగా ప్రతిపాదిస్తే భారాస ఓడించేందుకు యత్నించిందని విమర్శించారు. బలహీనవర్గాలకు చెందిన మహిళా గవర్నర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని.. కోర్టు గట్టిగా చెప్పాకే ఆమెను శాసనసభకు పిలిచారని పేర్కొన్నారు. ఈ విషయంలో దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీనవర్గాల మహిళలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఓడిపోగానే కేటీఆర్‌, కవిత విదేశాలకు వెళ్లిపోతారని.. ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు.

భారాస నేతలకు మహిళలంటే చిన్న చూపని.. వారు ఏ స్థాయిలో ఉన్నా అవమానించడమే పనిగా పెట్టుకున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ఓ ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికై చేస్తున్న తొలి ప్రసంగాన్ని బహిష్కరించడం ఆ వర్గం మహిళలను అవమానించడమేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని