సమస్యలు తీర్చని సమావేశమెందుకు?

‘ఎన్నికై ఏడాదైంది. వార్డుల్లో ఎక్కడి సమస్యలక్కడే ఉన్నాయి. అధికారులకు చెబితే పట్టించుకోరు. ప్రజలముందు తలెత్తుకు తిరగలేకపోతున్నాం.

Published : 01 Feb 2023 03:58 IST

కుప్పం కౌన్సిల్‌ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్ల ఆగ్రహం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ‘ఎన్నికై ఏడాదైంది. వార్డుల్లో ఎక్కడి సమస్యలక్కడే ఉన్నాయి. అధికారులకు చెబితే పట్టించుకోరు. ప్రజలముందు తలెత్తుకు తిరగలేకపోతున్నాం. సమావేశాల్లో కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కొన్ని వార్డులకే పనులు మంజూరు చేస్తున్నారు. వార్డుల్లో సమస్యలు తీర్చని కౌన్సిల్‌ సమావేశమెందుకు?’ అంటూ మంగళవారం జరిగిన కుప్పం మున్సిపల్‌ సమావేశంలో వైకాపా కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఎమ్మెల్సీ, వైకాపా జిల్లా అధ్యక్షుడు భరత్‌ హాజరు కావడంతో సమావేశానికి అధికార పార్టీ కౌన్సిలర్లు వచ్చారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని రెండోవార్డు వైకాపా కౌన్సిలర్‌ మునిరాజు... కమిషనర్‌ రవిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశ హాజరు పుస్తకాన్ని చించారు. ఆయనతోపాటు మిగిలిన వార్డు సభ్యులూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లారు. ఈ నెల 10కి సమావేశాన్ని వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని