రాష్ట్రపతి ప్రసంగంలోనూ ప్రభుత్వ ప్రచారం: ఖర్గే

పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో కొత్త విషయమేమీ లేదనీ, ప్రచారం కోసం ఆమె ప్రసంగాన్ని కూడా నరేంద్ర మోదీ సర్కారు వాడుకుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

Published : 01 Feb 2023 04:54 IST

దిల్లీ: పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో కొత్త విషయమేమీ లేదనీ, ప్రచారం కోసం ఆమె ప్రసంగాన్ని కూడా నరేంద్ర మోదీ సర్కారు వాడుకుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని రాష్ట్రపతి ప్రసంగం ద్వారా ప్రభుత్వం పేర్కొంటున్న మాట వాస్తవమైతే నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పేదలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు. పేరుమార్చిన పథకాలు నిరుపేదలకు చేరడం లేదని ఆరోపించారు. ‘అవినీతిని అంతం చేశామని ప్రభుత్వం చెబుతోంది. అదే నిజమైతే ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకుల్ని, ఎల్‌ఐసీని ఒక వ్యక్తి రూ.లక్ష కోట్ల మేర ఎలా మోసగించగలిగారు? ఎల్‌ఐసీలో పెట్టిన పెట్టుబడి అంతా ప్రధానికి సన్నిహితుడైన ఒక వ్యాపారికి వెళ్లిపోవడంతో 30 కోట్ల మంది ప్రజలు సతమతం అవుతున్నారు. పెట్టుబడిదారీ స్నేహితులకు దేశ సంపదను ఎలా దోచిపెట్టాలనేదే ఈ ప్రభుత్వానికి తెలుసు’ అని ఖర్గే విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు