సీఎం, మంత్రులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి

రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉండగా...విశాఖపట్నం రాజధాని కాబోతుందని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ కోరారు.

Updated : 02 Feb 2023 06:18 IST

సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌కు జడ శ్రవణ్‌కుమార్‌ ఫిర్యాదు  

ఈనాడు, అమరావతి: రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉండగా...విశాఖపట్నం రాజధాని కాబోతుందని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ కోరారు. సీఎంతో పాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిపై కూడా చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు అటార్నీ జనరల్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. రాజధాని అంశంపై సీఎం దిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. విశాఖ రాజధాని కాబోతుందని జగన్‌మోహన్‌రెడ్డి అనడం న్యాయ ప్రక్రియలో తలదూర్చడమేనని శ్రావణ్‌కుమార్‌ అభ్యంతరం తెలిపారు. అటార్నీ జనరల్‌తోపాటు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించనట్లయితే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని