11న రాష్ట్రానికి అమిత్‌ షా.. నెలాఖరుకు నడ్డా

ఈ నెలలోనే భాజపా అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా 11న, నెలాఖరుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా రాష్ట్రానికి వస్తారని పార్టీ ముఖ్యనేతలు తెలిపారు.

Updated : 02 Feb 2023 05:07 IST

ఖరారు కావాల్సిన ప్రధాని పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెలలోనే భాజపా అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా 11న, నెలాఖరుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా రాష్ట్రానికి వస్తారని పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ప్రధాని మోదీ ఈ నెల 13న వస్తారని తెలుస్తోందని అయితే పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో పర్యటనలో మార్పులు ఉంటాయని భావిస్తున్నామని వివరించారు. అమిత్‌షా, నడ్డా పర్యటనలు ఖరారైనట్లే అని వారు స్పష్టం చేశారు. 8 ఏళ్ల ఎన్డీయే పాలనను, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమాన్ని భాజపా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అమిత్‌ షా రాష్ట్రానికి వస్తున్నారని తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు