రేపు హైదరాబాద్‌కు ఠాక్రే

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే శుక్రవారం హైదరాబాద్‌ రానున్నారు. 6వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు.

Published : 02 Feb 2023 04:09 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే శుక్రవారం హైదరాబాద్‌ రానున్నారు. 6వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు. ఆ రోజున తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రారంభమయ్యే ‘హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌’ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 3న సాయంత్రం 6 గంటలకు గాంధీభవన్‌లో పలువురు నాయకులతో సమావేశమవుతారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా జరుగుతున్న హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమం నిర్వహణపై ఆయన ఈ పర్యటనలో శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు