సీఎం కేసీఆర్‌తో అమిత్‌జోగి భేటీ

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి తనయుడు, జనతా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమిత్‌జోగి బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

Published : 02 Feb 2023 04:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి తనయుడు, జనతా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమిత్‌జోగి బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయన తెలంగాణ అభివృద్ధి, దేశ రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు. భారాస విధి విధానాలను కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఉందని అభిప్రాయపడిన అమిత్‌ జోగి..భారాస పేరిట జాతీయ పార్టీని స్థాపించడాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అజిత్‌జోగి ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని కేసీఆర్‌కు బహూకరించారు. జనతా కాంగ్రెస్‌ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు