జూదం అనుమతించాలని ఎమ్మెల్యేను అడ్డుకున్న వైకాపా శ్రేణులు

దేవుడి ఉత్సవంలో జూదానికి అనుమతి ఇవ్వాలని వైకాపా నాయకులు పట్టుబట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Published : 02 Feb 2023 04:48 IST

పెదపూడి (జి.మామిడాడ), న్యూస్‌టుడే: దేవుడి ఉత్సవంలో జూదానికి అనుమతి ఇవ్వాలని వైకాపా నాయకులు పట్టుబట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో గుండాట, స్కిల్‌గేమ్స్‌ వంటి జూదాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. స్థానిక వైకాపా నాయకులు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిని ఆశ్రయించారు. ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడినా అనుమతివ్వలేదు. దీంతో ఎలాగైనా జూదానికి అనుమతి ఇప్పించాలని ఆలయ కమిటీ సభ్యులు, వైకాపా నాయకులు ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో స్వామి వారి రథోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే దంపతులు ఆలయానికి చేరుకున్నారు. గుండాట, స్కిల్‌గేమ్స్‌కు అనుమతి ఇప్పించనిదే ఆలయంలోకి ప్రవేశించకూడదని వైకాపా నాయకుడు చింతా దొరబాబు, అతని వర్గీయులు ఎమ్మెల్యే కారుకు అడ్డంగా బైఠాయించారు. ధర్నా చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. రథోత్సవానికి ఆటంకం లేకుండా చూశారు. ఎమ్మెల్యే తిరిగి వెళ్తున్న క్రమంలోనూ వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల రాకతో సమస్య సద్దుమణిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని