‘క్లాస్‌ వార్‌’ గురించి సీఎం మాట్లాడటం దౌర్భాగ్యం: పవన్‌

దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఎక్కువ సంపద కలిగిన జగన్‌ ‘క్లాస్‌ వార్‌’ అంటూ కామ్రేడ్‌ చారు మజుందార్‌, కామ్రేడ్‌ నాగిరెడ్డి, కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వారి గురించి మాట్లాడటం దౌర్భాగ్యం అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శించారు.

Published : 02 Feb 2023 06:21 IST

ఈనాడు, అమరావతి: దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఎక్కువ సంపద కలిగిన జగన్‌ ‘క్లాస్‌ వార్‌’ అంటూ కామ్రేడ్‌ చారు మజుందార్‌, కామ్రేడ్‌ నాగిరెడ్డి, కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వారి గురించి మాట్లాడటం దౌర్భాగ్యం అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్‌ చేశారు. ‘‘ఏపీలో సంపద ఉన్న వారు, లేనివారు అనే క్లాసులు లేనేలేవు. వైకాపా క్రూరత్వం రాష్ట్ర ప్రజలను బానిసలుగా మార్చింది. భూముల నుంచి ఇసుక వరకు.. మద్యం, గనులు, అడవులు, కొండలు, పేపరు, ఎర్రచందనం ఇలా రాష్ట్రం నుంచి వచ్చే ప్రతీ పైసా మన సంపన్న ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది.  రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఏపీ నుంచి పెట్టుబడిదారులు పారిపోతున్నారు’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు