పరిశీలకుడే చిచ్చుపెడుతున్నారు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే అసంతృప్తిగళం విప్పారు.

Published : 02 Feb 2023 05:38 IST

నెల్లూరు జిల్లాలో మరో వైకాపా ఎమ్మెల్యే అసంతృప్తగళం

వరికుంటపాడు, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే అసంతృప్తిగళం విప్పారు. అధిష్ఠానం పరిశీలకునిగా నియమించిన కె.ధనుంజయరెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ధనుంజయరెడ్డి వర్గాలను పెంచుతున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దశాబ్దాలుగా తాను వైఎస్సార్‌ కుటుంబానికి విధేయుడినని.. తనపై పెత్తనం చేయాలంటే కుదరదని అన్నారు. ధనుంజయరెడ్డి తెదేపాకు చెందినవారని, ఆ పార్టీ నాయకులకు పనులు చేయాలంటూ అధికారులకు సూచిస్తున్నారని మండిపడ్డారు. తాను ఇటీవల సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ధనుంజయరెడ్డిని వెంటనే తొలగించాలని కోరానని వివరించారు. ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీలో వర్గాలు మరింత పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని