భారాస.. ఆప్‌ల ‘మద్యం సంబంధాలు’

దిల్లీ మద్యం కేసుతో భారాస.. ఆప్‌ సంబంధాలు పెనవేసుకుపోయాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు.

Published : 03 Feb 2023 04:50 IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసుతో భారాస.. ఆప్‌ సంబంధాలు పెనవేసుకుపోయాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. దీంతోనే తెరాస భారాసగా అవతరించిందని విమర్శించారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరు చోటుచేసుకోవడంపై స్పందిస్తూ చట్టం ఎవరి చుట్టం కాదన్నారు. ఖమ్మంలో భారాస సభకు ఆప్‌ తరఫున దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు హాజరుకావడం చూస్తే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఉందన్నారు. కేంద్ర బడ్జెట్‌ దేశహితాన్ని కాంక్షించేలా ఉందని కొనియాడారు. హైదరాబాద్‌లో ఎపోగ్రఫీ మ్యూజియం రానుందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని