పేదల పొట్టగొడుతున్న కేంద్రం: కవిత

కార్పొరేట్లకు వంతపాడుతున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తోందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

Published : 03 Feb 2023 04:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: కార్పొరేట్లకు వంతపాడుతున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తోందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బడ్జెట్‌లో దీనికి నిధులు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆమెను గురువారం ఉపాధి హామీ పథకం పొరుగుసేవల ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్‌, ఛైర్మన్‌  లింగయ్య, ఇతర ప్రతినిధులు కలిశారు. పథకాన్ని పరిరక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘పేదలకు వీలైనంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్రం సహకరించడం లేదు. పైగా రైతువేదికల వంటి ప్రజోపయోగ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టగా ఈ నిధులను వాపసు చేయాలని నోటీసులు పంపిస్తోంది’’ అని కవిత అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని