Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి

నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో తనకు మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే స్ఫూర్తి అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి వ్యాఖ్యానించారు.

Updated : 03 Feb 2023 07:33 IST

ఈనాడు, బెంగళూరు: నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో తనకు మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే స్ఫూర్తి అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో మాట్లాడుతూ తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్‌ తనకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ మిషన్‌ భగీరథ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌కు ఏమాత్రం తీసిపోదని చెప్పారు.  తనకు మరోమారు అధికారాన్ని అందిస్తే తెలంగాణ తరహా సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని