కేసీఆర్‌.. ఒక్కరోజు పాదయాత్రకు సిద్ధమా?

సీఎం కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే ఒక్క రోజు బూట్లు వేసుకుని పాదయాత్రకు రావాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు.

Published : 03 Feb 2023 04:46 IST

వైఎస్‌ షర్మిల సవాల్‌

ఈనాడు, వరంగల్‌, నెక్కొండ, చెన్నారావుపేట, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే ఒక్క రోజు బూట్లు వేసుకుని పాదయాత్రకు రావాలని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్రకు బయలుదేరే ముందు ఆమె గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కేసీఆర్‌ గారూ.. మీకు బూట్లు కూడా పంపుతున్నాం. ప్రజల సమస్యలు చూసేందుకు ఒక్కరోజైనా వచ్చి మాతో నడవాలి.  సమస్యలు ఏవీ లేవని రుజువు చేస్తే నేను ముక్కు నేలకు రాసి, రాజకీయాలు మానేస్తా. సమస్యలుంటే మీరు రాజీనామా చేసి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేయాలి’ అని షర్మిల సవాల్‌ చేశారు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా వద్ద నవంబరు 28న షర్మిలను భారాస నేతలు అడ్డుకోవడంతో ఆమె యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. షర్మిల గురువారం తన పాదయాత్రను నిలిచిపోయిన చోటు నుంచే ప్రారంభించారు. తాను సీఎం అయితే ప్రతి వృద్ధురాలికి రూ.3,016 పింఛను ఇస్తానని, ఉద్యోగాల కల్పనపై తొలి సంతకం చేస్తానని షర్మిల చెప్పారు. పాదయాత్రకు పోలీసులు భారీ భద్రత కల్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు