వ్యవసాయ రంగం నిర్వీర్యానికి కేంద్రం కుట్రలు: భట్టి

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. ఆయన గురువారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 03 Feb 2023 04:46 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. ఆయన గురువారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్య, వైద్య రంగాలకు, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, పీఎం కిసాన్‌ లాంటి పథకాలకు బడ్జెట్‌లో కోత పెట్టారని, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేశారని తప్పుపట్టారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను కనీసం 30 నుంచి 35 రోజులపాటు నిర్వహించాలని భట్టివిక్రమార్క డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని నింపిందని యాత్రలో ఆద్యంతం పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు బెల్లయ్య నాయక్‌, కేతూరి వెంకటేశ్‌, వెంకట్‌రెడ్డి తెలిపారు. పాదయాత్రలో పాల్గొని తిరిగొచ్చిన సందర్భంగా వారికి గురువారం శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం గాంధీభవన్‌లో వారిని సన్మానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు