అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ భద్రత లేదా?

‘‘అధికారపార్టీ ఎమ్మెల్యేలు అభద్రతా భావంతో ఉన్నారు. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులూ లేవు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడం, ఫోను సంభాషణలు దొంగచాటుగా వినడం అనేవి పాలకుల అభద్రతా భావాన్ని బయటపెడుతున్నాయి.

Published : 03 Feb 2023 05:35 IST

ఫోను ట్యాపింగులు, ప్రాణహాని ఆందోళనలు: పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘‘అధికారపార్టీ ఎమ్మెల్యేలు అభద్రతా భావంతో ఉన్నారు. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులూ లేవు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడం, ఫోను సంభాషణలు దొంగచాటుగా వినడం అనేవి పాలకుల అభద్రతా భావాన్ని బయటపెడుతున్నాయి. వెంకటగిరి అధికారపార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయనిపిస్తోంది. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై హోంమంత్రి, డీజీపీ ఎందుకు స్పందించరు?’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఈ అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వ్యవహారశైలి, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై ఆనం రామనారాయణరెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించడమే నేరమని ప్రభుత్వ పెద్దలు భావించినట్లున్నారని, ఆయన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారని జనసేన అధినేత విమర్శించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆనం రక్షణ బాధ్యతలు డీజీపీ తీసుకోవాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. ఆయనకు తగిన రక్షణ కల్పించకపోతే ఇక్కడి పరిస్థితులపై కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తామని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని