Perni Nani: ‘జగన్‌ పిచ్చి మారాజు’

సీఎం జగన్‌ పిచ్చి మారాజు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సొంత మనిషని నమ్మారు. ఇప్పుడు కోటంరెడ్డి నమ్మకద్రోహం చేశారు’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

Updated : 03 Feb 2023 07:56 IST

కోటంరెడ్డి భక్తుడన్న మత్తులో ఉండిపోయారు: పేర్ని

‘సీఎం జగన్‌ పిచ్చి మారాజు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సొంత మనిషని నమ్మారు. ఇప్పుడు కోటంరెడ్డి నమ్మకద్రోహం చేశారు’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ‘చచ్చేవరకూ వైకాపాలో ఉంటానని, తాను మరణిస్తే సీఎం హోదాలో జగన్‌ వచ్చి తన శవంపై దండవేయాలని గతంలో కోటంరెడ్డి అన్న మాటలను జగన్‌ నిజమని నమ్మారు. అందుకే శ్రీధర్‌రెడ్డి తేడాగా ఉన్నారని ఎందరు చెప్పినా పట్టించుకోలేదు. ఇంటెలిజెన్స్‌ అధిపతి పంపారని కోటంరెడ్డి చెబుతున్న వీడియోతో పాటు దానికింద టైపుచేసిన మెసేజ్‌లో ఏముందో చూడాలి. ఆరేడు నెలల శ్రీధర్‌రెడ్డి వాట్సప్‌ సందేశాలను మీడియా ముందు పెట్టమనండి. కోటంరెడ్డికి సన్నిహితుడైన కాంట్రాక్టరు రామశివారెడ్డి రికార్డు చేసి పంపారని మావాళ్లు చెబుతున్నారు. డిసెంబరు 25న శ్రీధర్‌రెడ్డి.. చంద్రబాబు ఇంటికి వెళ్లి 2 గంటలు మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే లోకేశ్‌తో కోటంరెడ్డి మాట్లాడుతున్న విషయాన్ని ఎప్పుడో తెలుసుకునే వాళ్లం కదా?’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని