వ్యవసాయ బడ్జెట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి

వైకాపా ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలో వ్యవసాయ శాఖకు ఎంత బడ్జెట్‌ కేటాయించింది?.. ఎంత ఖర్చు చేసింది? అన్న అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 03 Feb 2023 04:45 IST

దెబ్బతిన్న మిర్చితోటలను పరిశీలించిన తెదేపా కమిటీ

చిలకలూరిపేట గ్రామీణ, యడ్లపాడు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలో వ్యవసాయ శాఖకు ఎంత బడ్జెట్‌ కేటాయించింది?.. ఎంత ఖర్చు చేసింది? అన్న అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడు, చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద దెబ్బతిన్న మిర్చితోటలను తెదేపా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం పరిశీలించారు. పత్తిలో గులాబీ రంగు పురుగు, మిర్చి పంటలో నల్లతామరతో నష్టపోయామని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 4.30 లక్షల ఎకరాల్లో మిర్చి వేసిన రైతులు నల్లతామరతో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించాలని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్‌ చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో పురుగు మందులు దొరకక నల్లబజారులో కొంటుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ దేశంలోని రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు